తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న అయ్యప్ప భక్తుల కారు ను మరో కారు ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడ్డారు. విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెంది న అయ్యప్ప భక్తులు ఐదుగురు రామేశ్వరానికి కారులో బయలుదేరారు. శనివారం తెల్లవారు జామున విశ్రాంతి కోసం రామనాథపురం జిల్లా కీలకరై బీచ్ రోడ్డులోని కుంబిడు మధురై సమీపంలో రోడ్డు పక్కన తమ కారుని నిలిపారు. ఈ క్రమంలో కీళకరై వైపు వెళ్తున్న డిఎంకె మున్సి పల్ కౌన్సిల్ అధ్యక్షుడి కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న అయ్యప్ప భక్తుల కారుని ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలో ఎపికి చెందిన కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు, డిఎంకె మున్సిపల్ చైర్మన్ కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం గురించి సమాచారం అందు కున్న కీళకరై పోలీసులు తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని
చికిత్స కోసం రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ ఎపికి చెందిన ఒక అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. మొత్తం ఈ ప్రమాదంలో ఎపికి చెందిన నలుగురు, తమిళనాడుకు చెందిన ఒకరు దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసు పత్రికి తరలిం చారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఎపిలోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరప కొత్త వలస వాసులు వంగర రామకృష్ణ(51), మార్పిన అప్పలనాయుడు(33), మరాడ రాము(50), గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు(35), తమిళనాడుకు చెందిన డిఎంకె చైర్మన్ కారు డ్రైవర్ ముస్తాక్ అహ్మద్ ఉన్నారు. తమిళనాడు రామేశ్వరంలో రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసుల మృతి చెందడం పట్ల మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నా యుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.