న్యూఢిల్లీ : డీప్‌ఫేక్ నియంత్రణకు సంబంధించిన ప్రైవేట్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఇలాంటి కంటెంట్ కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ డీప్‌ఫేక్‌తో వేధింపులు, మోసం, తప్పుడు సమాచారం ఇలా ఎంతో దుర్వినియోగం అవుతోందని, తక్షణ దీని నియంత్రణకు చర్యలు చేపట్టాలని శిండే అన్నారు.
దురుద్దేశంతో ఇలాంటి కంటెంట్‌ను రూపొందించినా, లేదా వ్యాప్తి చేసినా, అలాంటి నేరస్థులకు శిక్షలు కఠినంగా విధించాలన్నారు.ఈ సందర్భంగా వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రత గురించి ప్రస్తావించారు. కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో డీప్‌ఫేక్ టెక్నాలజీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ కలవరపెడుతోందని, ఈ డీప్‌ఫేక్‌తో సైబర్ నేరగాళ్లు అవలీలగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
.