మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మీర్‌ఖాన్‌పేటలో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తూ లేఖ రాశారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగా ణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమి క పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీ ణ వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహం తో తెలంగాణ ముందుకు సాగుతోందని సోనియా గాంధీ ఈ లేఖలో ప్రస్తావించా రు. తెలంగాణలోని మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపు ణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి సమ్మిట్ మరింత తోడ్పడుతుందని ఆమె తెలిపారు. సమ్మిట్‌లో పాల్గొనేవారందరికీ సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు.