పారిస్: ఫ్రాన్స్ దేశంలో ఓవర్సీస్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గ్వాడెలోప్‌లోని సెయింట్ ఆన్‌లో క్రిస్మస్ వేడుకలు జరగుతుండగా వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు డ్రైవర్ అనారోగ్య సమస్యలు తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్ అక్కడే ఉన్నాడు. ఫ్రాన్స్ పౌరులు శోకసంద్రంలో మునిగిపోయారు.