బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ తాజాగా తమ కొత్త ఇంటిలోకి అడుగు పెట్టారు. ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను అలియా భట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముంబయ్‌లోని పాలిహిల్స్ రెసిడెన్సీలోని ’కృష్ణరాజ్’ బంగ్లా’లో జరిగిన ఈ గృహ ప్రవేశం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. తన మనసుకు నచ్చినట్టుగా అలియా భట్ నిర్మించుకున్న ఈ ఇంటి విలువ రూ.250 కోట్ల నుండి 400 కోట్ల మధ్య ఉంటుందని తెలిసింది.