హైదరాబాద్: నటుడు సూర్య సొదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపట్టి ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు కార్తి. వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ.. మంచి ప్రేక్షకాధరణ పొందుతున్నాడు. కార్తి నటించిన లేటెస్ట్ చిత్రం ‘వా వాతియార్’. తెలుగులో ఈ సినిమాని ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని స్టూడియో గ్రీన్ అధినేత కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాపై కార్తి అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. అంతేకాదు.. హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదల కానుంది.