ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఐదో రోజు కొనసాగింది. శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (శంషాబాద్) విమానాశ్రయంలో 69 సర్వీసులు రద్దు అయ్యాయి. హైదరాబాద్ నుండి వెళ్లాల్సిన 43 సర్వీసులు, ఇక్కడికి రావాల్సిన 26 విమానాలు రద్దు ఇండిగో రద్దు చేసింది.దీంతో ఇండిగో కౌంటర్ల వద్ద తమ ప్రయాణాలకు సంబంధించిన టికెట్ల వివరాలు, రీఫండ్, ప్రత్యామ్నాయ ప్రయాణాల కోసం బారు తీరారు. అధికారుల సరిగా స్పందించకపోవడంతో ప్రయాణికులు నిరసనలు, నినాదాలతో శంషాబాద్ విమానాశ్రయం దద్దరిల్లింది. సరయిన సమాధానం చెప్పకుండా ఇండిగో సిబ్బంది దాటవేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
ఈ క్రమంలో ప్రయాణికుల పడిగాపులు, ఆందోళనలతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. డిజిసిఏ నిబంధనలు విరమించు కున్నప్పటికి సమస్య విమాన సర్వీసులు రద్దు కొనసాగడం పట్ల ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన తొమ్మిది విమానాలు రద్దయ్యాయి. ఇందులో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. కాగా, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరో 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా శనివారం వరకు 400కు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లు సంస్థ వెల్లడించింది.
00000