న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందుకు ప్రతిపక్షం లోని రాహుల్‌ను లేదా ఖర్గేను ఆహ్వానించకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌ను పిలవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శశిథరూర్ విందుపై స్పందిస్తూ ఆ వాతావరణం ఆత్మీయత వెల్లివిరిసిన ఆతిథ్యంగా అభివర్ణించారు. విందులో పాల్గొన్న అనేక మంది ప్రతినిధులతో ముఖ్యంగా రష్యా ప్రతినిధులతో చర్చించే అవకాశం ఎంతో ఆనందం కలిగించిందని తన సామాజిక మాధ్యమ పోస్ట్‌లో పేర్కొన్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మండిపడింది. ఈ విందులో థరూర్ పాల్గొనడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ నేత పవన్‌ఖేడా విమర్శించారు. తామంతా పార్టీలోనే ఉన్నప్పుడు మన నాయకులను ఆహ్వానించకుండా మనం పాల్గొనడాన్ని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు.