అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదంలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి ఉడుముల సహజారెడ్డి (24) మృతి చెందారు. జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న ఆమె తల్లిదం డ్రులకు అధికారులు ఈ విషాద వార్తను తెలియజేశారు. సహజారెడ్డి ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితం అమె రికా వెళ్లారు. ఆమె చదువులు పూర్తవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సహ జారెడ్డి మృతితో శ్రీనివాస కాల నీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని భారత ఎంబసి ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఆమె కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపింది. స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల ప్రాంతం గుంటూ రుపల్లికి చెందిన ఉడుముల జయాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని టిపిఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తు న్నారు. ఆయన భార్య శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీగా పని చేసి, డిప్యుటేషన్‌పై ఇటీవల హైదరాబాద్ వచ్చారు. కొన్నేళ్లుగా వీరి కుటుం బం జోడిమెట్లలో నివాసం ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె హైదరాబాద్‌లోనే బిబిఎస్ కోచింగ్ తీసుకుం టోంది. పెద్ద కుమార్తె సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికా వెళ్లారు. సహజారెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్కనున్న మరో భవ నం నుంచి మంటలు వేగంగా వ్యాప్తి చెందా యి. ఆ సమయంలో నిద్రలో ఉన్న సహజారెడ్డి మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది.