స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి చేయాలన్న యోచన నుంచి విరమించుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనకు ముందుకొస్తోంది. స్మార్ట్‌ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను నిరతంరం యాక్టివేట్ చేయడం తప్పనిసరి చేసేందుకు యోచన చేస్తోంది. టెలికాం పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు ఆయా ఫోన్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చేందుకు సంసిద్ధమవుతోంది. అయితే దీనికి యాపిల్ లాంటి కంపెనీలు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగిస్తుందని ఆయా కంపెనీలు అభ్యంతరకం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు సెల్యూలార్ టవర్ డేటాపై లొకేషన్ కోసం ఆధారపడుతున్నాయి. దాన్ని అధిగమించడంతో పాటు విచారణ మరింత వేగవంతంగా జరిగేందుకు వీలుగా లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిరంతరం యాక్టివేషన్ సాయపడుతుందని ఆయా దర్యాప్తు సంస్థలు చేసిన సూచనల మేరకు ఈ ప్రతిపాదనపై కేంద్రం సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.