యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుం ది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ యామిని భాస్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఇందులో నా క్యారెక్టర్ పేరు శ్రావ్య. ఒక హానికరమైన బంధం నుంచి బయటకు వచ్చి స్వతహాగా బ్రతకాలనుకుంటుంది. ఇదే సమయంలో సిద్ధార్థ కి బ్రేక్ అప్ అయి ఉంటుంది. తను అన్ని వదిలేసి ఒక బస్తీలో ఉండడానికి వస్తాడు. అక్కడ మేము కనెక్ట్ అవుతాము. అప్పుడు ఒక ప్రేమ కథ మొదలవుతుంది. ఇది ఒక సహజమైన ప్రేమ కథ. –సురేష్ బాబు ఈ సినిమాని తీసుకోవడం మా అందరికీ పెద్ద సర్‌ప్రైజ్ ”అని అన్నారు.