ఇండిగో విమానసర్వీసుల రద్దు ప్రభావం నూతన వధూవరుల రిసెప్షన్‌పై చూపించింది. ఇటీవలనే పెళ్లి చేసుకున్న ఈ నవదంపతులు ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక లోని హుబ్బళ్లికి చెందిన మేధా క్షీరసాగర్, ఒడిశా లోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్‌లు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నవంబరు 23న భువనేశ్వర్‌లో వీరి పెళ్లి జరిగింది. వధువు స్వస్థలం వద్ద బుధవారం రిసెప్షన్ ఏర్పాటైనా, భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానసర్వీసుల్లో అంతరాయం వల్ల వీరు వెళ్లలేక పోయారు. రిసెప్షన్‌కు అతిధులు హాజరవ్వడంతో ఇక చేసేది లేక రిసెప్షన్ హాల్‌లో స్క్రీన్ ద్వారా వధూవరులను చూపించ వలసి వచ్చింది.