హైదరాబాద్: ఇళ్లులేని పేదవారికి ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీసుకున్నామని, వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జి ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తామని అన్నారు. ప్రస్తుతం 3 రకాల ఇళ్ల నిర్మాణం, ప్రస్తుతం 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని తెలియజేశారు. కేంద్రం ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాకు వెళ్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.