అమరావతి: లారీ బోల్తాపడడంతో సహాయక చర్యలు చేపడుతుండగా వారిపైకి ఆర్‌టిసి బస్సు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్‌కెవిబి ప్రాంతంలో చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై లారీ బోల్తాపడింది. లారీలో నుంచి డ్రైవర్‌ను బయటకు తీస్తుండగా వారిపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.