న్యూఢిల్లీ: అమెరికా భారీగా విధిస్తున్న సుంకాలు, ఆం క్షల నేపథ్యంలో భారతదేశం రష్యా వచ్చే ఐదేళ్లలో ఆర్థి క, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఓ ప్రణాళికపై శుక్రవారం నాడు నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశం – రష్యా మధ్య ఎనిమిది దశాబ్దాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, మరింద దృఢంగా కొత్త పుంతలు తొక్కేలా చేసేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రష్యా – భారతదేశం వార్షిక శిఖరాగ్ర చర్చల సందర్భంగా ఉభయు లూ ప్రసంగిస్తూ, రెండు దేశాల స్నేహబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, భౌగోళిక, రాజకీయ గందరగోళ పరిస్థితులు ఉన్నా, స్నేహబంధం దృవనక్షత్రంలా స్థి రంగా ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
పరస్పర గౌరవం, దృఢ నమ్మకంపై నిర్మించిన ఈ స్నేహబంధం ఎల్లప్పుడూ కాలపరీక్షకు నిలిచిందని. ఈ పునాది మరింత బలోపేతం చేయడానికి అన్నిరంగాలలో సహకారంపై శుక్రవారం నాడు చర్చించామని, ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ. 2030 ఆర్థిక కా ర్యక్రమాన్ని ఖరారు చేయడంతో పాటు, ఆరోగ్యం, ఆ హార భద్రత, షిప్పింగ్ రంగాలతో పాటు వలసలు, ప్ర జల మధ్య పరస్పర మార్పిడి వంటి అనేక రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి సంబంధించిన అనేక ఒ ప్పందాలపై ఉభయపక్షాలు సంతకాలు చేశాయి. ర ష్యా పౌరులకు భారతదేశం త్వరలో 30 రోజుల ఉచిత ఈ- టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాలను ప్రవేశపెడుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.
రెండు పక్షాలు వార్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 64 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచాలని చూస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తెలిపారు. భారతదేశం ఇంధన అవసరాలను తీర్చడానికి రష్యా చమురు, గ్యాస్, బొగ్గు వంటి ఉత్పత్తుల నమ్మకమైన సరఫరాదారు అని పుతిన్ స్పష్టం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఇంధనాన్ని నిరంతరాయంగా రవాణా చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. భారత ఉత్పత్తులకు రష్యా మార్కెట్ కల్పిస్తుందని, చిన్న, మాడ్యులర్ అణు రియాక్టర్లు, తేలియాడే అణువిద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సహకారం కోసం ఇరు పక్షాలు ఆసక్తితో ఉన్నాయని కూడా పుతిన్ తెలిపారు వైద్య, వ్యవసాయ రంగాలలోనూ రష్య సహాయం అందించగలదని తెలిపారు. మోదీ మాట్లాడుతూ, ఇంధన భద్రత ఉభయదేశాల భాగస్వామ్యానికి బలమైన పునాది అన్నారు పౌర అణుశక్తి రంగంలో సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు.