హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప-2’. గతేడాది విడుదలైన ఈ సినిమా గ్రాండ్ సక్పెస్‌ను సాధించింది. అయితే సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సమయంలో మరోసారి ప్రత్యేక షోలో ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోని మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు బారులు తీరారు.
బాలనగర్లలోని విమల్ థియేటర్‌లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షో వేశారు. అయితే అయితే ఈ షో టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. కేవలం సింగిల్ షో కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే టికెట్స్ దక్కడంతో మరికొందరు ఫ్యాన్స్ గొడవకు దిగారు. కొందరు ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ ఏకంగా కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.