సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ.. బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. 340కి పైగా స్కోర్ సాధిస్తే.. తొలి మ్యాచ్‌లో దాన్ని రక్షించుకున్నా.. రెండో మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్ల ధాటికి భారీ స్కోర్‌ను సైతం కాపాడుకోలేకపోతున్నారు. అయితే టెస్ట్ సిరీస్‌లో వైఫల్యం, రెండో వన్డే మ్యాచ్ ఓటమి నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
కచ్చితంగా గెలిచి తీరాల్సిన కీలక వన్డే మ్యాచ్‌లో తుది జట్టు నుంచి ఓ ఇద్దరు ఆటగాళ్లపై వేటు వేయాలని గంభీర్ అండ్ కో నిర్ణయం తీసుకుందట. ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. తొలి వన్డేలో 13 పరుగులు, రెండో వన్డేలో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతడిని పక్కన పెట్టి.. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా రిషబ్ పంత్ కానీ, తిలక్ వర్మను కానీ జట్టులోకి తీసుకుంటారని టాక్. ఇక బౌలర్ ప్రశిద్ధ్ కృష్ణను కూడా జట్టు నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారట. నితీశ్‌ని జట్టులోకి తీసుకుంటే.. బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.