అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పల్లంకుర్రు బాలికను మోకా గిరి (33) అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. బాలికను మాయమాటలతో మోసగించి తనతో ఆమెను గిరి తీసుకెళ్లాడు. దగ్గరి బంధువైన యువతి ద్వారా బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లినట్టు సమాచారం. స్కూల్ నుంచి తమ కుమార్తెను బయటకు పంపడంతో బాలిక బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గిరికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా సమాచారం.