అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ చేసిన సర్జికల్ బ్లేడ్ ను కడుపు పెట్టి కుట్లు వేశారు. రమాదేవి అనే మహిళ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆపరేషన్ చేసిన అనంతరం కడుపులో వైద్యులు బ్లేడు వదిలేశారు. తీవ్ర కడుపునొప్పితో మళ్లీ స్కానింగ్ చేయడంతో తొడ కండరాల్లో బ్లేడు ఉన్నట్టు గుర్తించారు. వైద్యుల నిర్లక్ష్యంపై మహిళ కుటుంబసభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.