రష్యా మనకు ఎప్పట్నుంచో మిత్రదేశం అని.. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని,ఇరుదేశాల మధ్య సహకారం ఉంటుందని అన్నారు. భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. వలస విధానంపై, వైద్య, ఆరోగ్య రంగాలపై, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ సరఫరాపై, సముద్ర ఆహార ఉత్పత్తులపై కార్మికులు, షిప్పింగ్ పై ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంయుక్త మీడియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మోడీ మాట్లాడుతూ.. భారత్, రష్యా స్నేహం.. ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మైలురాయిగా నిలుస్తాయని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పరస్పర ప్రయోజనం కలిగిస్తున్నాయని, భారత్ వాణిజ్యానికి రష్యా అండగా నిలుస్తోందని అన్నారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని, యూరియా ఉత్పత్తికి రష్యా సాయం చేస్తోందని మోడీ పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళికపై 2030 వరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం చేసుకున్నామని, ఎఫ్ టిఎ అంకానికి ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని మోడీ స్పష్టం చేశారు.
భారత్, రష్యా స్నేహసంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. మోడీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని అన్నారు. భారత్ తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని, ఒప్పందంలో వాణిజ్యం, సాంకేతికత కీలక ప్రాధాన్యాలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకున్నామని, భారత్, రష్యా రవాణా అనుసంధానం పెంచడం తమ లక్ష్యమని అన్నారు. అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామని పుతిన్ పేర్కొన్నారు.