బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ-2’. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 5) విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనుకొని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ‘అఖండ-2’ విడుదల వాయిదా పడిన వేళ.. సంగీత దర్శకుడు తమన్ ఎక్స్ సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మథుర నుంచి మిశ్రా సోదరులు (పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా) శ్లోకాలు పాడుతున్న వీడియోని తమన్ షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు సినిమా విడుదలకు మార్గం సుగమం అయిందని కామెంట్లు చేస్తుండగా.. రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పాలని మరికొందరు అడుగుతున్నారు. బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఐదో చిత్రం ‘అఖండ-2’ కావడం విశేషం. బాలకృష్ణ 111వ చిత్రానికి కూడా తమనే సంగీతం అందిస్తున్నారు. దీంతో ఇది డబుల్ హ్యాట్రిక్ కాంబినేషన్ కానుంది. కాగా, మిశ్రా సోదరులు అఖండ-2 చిత్రం కోసం పని చేశారు.
Thanks guruji ☀️🔱🔥🙏 #Mishra Brothers ji
All the Way from #Mathura #Akhanda2Thaandavam 🔱#JaiBalayya 🦁 pic.twitter.com/cD93QRBS6x— thaman S (@MusicThaman) December 5, 2025