యంగ్ హీరో విరాట్ కర్ణ… అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నాగబంధంతో అలరించబోతున్నారు. ఈ సినిమా డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌తో ఒక మాసీవ్ సినిమాటిక్ వండర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం టీం నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్‌బంప్స్ పుట్టించే క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్‌గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ తన బృందంతో కలిసి సెట్లోని ప్రతి అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించి, కథనం స్థాయిని మరింతగా పెంచేలా శ్రద్ధ తీసుకున్నారు.
అద్భుతమైన యాక్షన్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీని టీం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దితున్నారు. నాగబంధంలో నభా నటేష్ , ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుంది. శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న నాగబంధం అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ నడిచే ఈ కథ, పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో ఉంటుంది. నాగబంధం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.