హైదరాబాద్: సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు బిఆర్ఎస్ యత్నిస్తోందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొణిజేటి రోశయ్య, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని, ఈ దేశానికి వారు సంపద అని కొనియాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఉంటే తప్పేంటి? అని మహేష్ ప్రశ్నించారు. బిజెపి కోసమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, కాలుష్యరహితంగా హైదరాబాద్ మారుతుందని తెలియజేశారు. అవినీతికి అలవాటు పడిన మాజీ సిఎం కెసిఆర్ కుటుంబానికి తమ ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అంటూ విమర్శించడం అలవాటుగా మారిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.