వివాహం చేసుకుంటానని చెప్పి మహిళ వద్ద నుంచి రూ. 3,38,200 సైబర్ నేరస్థులు కొట్టేశారు. హైదరాబాద్, సైదాబాద్, వినయ్ నగర్‌కు చెందిన మహళ(47) యూక్‌కు చెందిన హిరాద్ అహ్మద్ వివాహం ప్రపోజల్ వచ్చింది. మ్యాట్రీమోనిలో రావడంతో మహిళ అంగీకరించింది, ఇద్దరు మొబైల్ నంబర్ మార్చుకుని రోజు మాట్లాడుకునేవారు, వీడియో కాల్స్, ఛాటింగ్ చేసుకునేవారు. తర్వాత బాధితురాలిని రెండు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించాడు, రెండు కొత్త సిమ్‌లు తీసుకోమని ఢిల్లీలోని యూకే నకిలీ అఫైర్స్ ఆఫీస్‌లోకు పంపమని చెప్పాడు. తర్వాత నకిలీ వీసా బాధితురాలికి పంపించి, వివాహానికి సంబంధించిన పేపర్లు పంపించాడు. వాటిని ప్రాసెస్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. వీసా ఫీజులు, లేట్ ఛార్జీలు తదితరాల పేరు చెప్పి రూ. 3,38,200 వసూలు చేశాడు. తర్వాత కూడా వేరే నంబర్లతో కాల్స్ రావడంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.