పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్టుగా ఈ మార్చికల్లా మావోయిస్టు పార్టీ అంతరించిపోతుందా? పెద్ద నాయకుల నుండి కార్యకర్తల వరకూ వందల సంఖ్యలో ప్రాణ త్యాగాలూ, సాయు ధ లొంగుబాట్లూ సమాజానికి ఏ సంకేతాలను ఇస్తున్నాయి? జల్ జంగిల్ జమీన్ మీద హక్కు కోసం సాగిస్తున్న పోరాటం ఆగదం టూ లొంగిపోతున్న మావోయిస్టులమీద సా మాజిక కార్యకర్త సోనీ సోరి వ్యక్తం చేసిన ఆ గ్రహం మరో పోరాట రూపం తీసుకుంటుం దా? ఎక్కడో అడవుల్లో ఏర్పాటుచేసిన జనతన రాజ్యాలు ప్రజలకు మేలు చెయ్యవని గ్రహిం చి నీళ్ళలో చేపల్లా ప్రజల్లో కలిసిపోవాలన్న ఎత్తుగడలో భాగంగానే భారీ సంఖ్యలో లొం గుబాట్లు జరుగుతున్నాయా? మావోయిస్టు పార్టీ పూర్తిగా కనుమరుగయినా, వందల ఏ ళ్ళుగా సాగుతున్న ఆదివాసీ పోరాటాలు మా నవీయ, శాంతియుత సమాజం ఏర్పడేవర కూ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉం టాయా? ఈ రోజు ‘సమగ్ర’లో ప్రముఖ వి ద్యావేత్త, పౌర హక్కుల నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ కవి, రచయిత హెచ్చా ర్కె, సీనియర్ పాత్రికేయుడు ఎస్.కె.జకీర్ అభిప్రాయాలు చదువుదాం.