అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని భవానీపురంలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జోజినగర్ లోని 42 ఫ్లాట్ల బాధితులు చంద్రబాబు ఆదుకోవాలంటూ సిఎం ఇంటి ముందు ధర్నాకు దిగారు. సిఎంను కలిసే అవకాశం కల్పించాలంటూ పోలీసులతో బాధితులు మొర పెట్టుకుంటున్నారు. ఇళ్లు కూలగొట్టడంతో అక్కడ కూడా రోడ్ల మీదే పడుకోవడం కంటే చంద్రబాబు ఇంటి ముందే కూర్చున్నామని బాధితులు వాపోయారు. మా ఇండ్లు కూలగొట్టడంతో రోడ్డు పడ్డామని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు
భారీ పోలీసు బందోబస్తు నడుమ భవానీపురంలో 42 ఫ్లాట్స్ కూల్చివే కూల్చివేశారు. 42 ఫ్లాట్స్ కూల్చివేతతో బాధితులు రోడ్డున పడ్డారు. విజయవాడ భవానీ పురంలో బాధితులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ పోసుకొని బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉదయం ఫ్లాట్స్ కూల్చుతున్న వేళ పట్టించుకోలేదని ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు అని పోలీసులపై బాధితుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో సదరు సొసైటీ కూల్చివేసిన ప్రాంతం చుట్టూ గోడ కడుతున్నారు.