మన తెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి : ఆదాయానికి మించిన ఆస్తుల కే సులో మరో అవినీతి భారీ తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చి క్కింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కోతం శ్రీనివాసులు ఇంట్లో ఎసిబి అధికారులు గురు వారం సోదాలు నిర్వహించగా లభించిన సమాచారం మేరకు ఆయన ఆస్తి రూ.100 కోట్లకు పైగా నే ఉంటుందని ఎసిబి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.రాయదుర్గంలోని ఆయన నివాసం, బంధువులు, స్నేహితులు, బినామీలు, సన్నిహతులకు సంబంధించిన 7 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ సోదాల్లో లో 33 ఎకరాల వ్యవసాయ భూమి (నారాయణపేటలో 11 ఎకరాలు. ఆనంతపురంలో 11 ఎకరాలు. కర్ణాటకలో 11 ఎకరాలు), 7 ప్లాట్లు, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్, ప్లాట్, మూడు వాహనాలు, ఐదు లక్షల నగదు
, 1600 గ్రాముల బంగారం, 770 గ్రాముల వెండితో సహా విలువైన ఆస్తులు కనుగొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తనిఖీలు చేశారు. శ్రీనివాసులు తన సర్వీసు కాలంలో అవినీతి , అసాధారణ మార్గాల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లు ఎసిబి దర్యాప్తులో వెల్ల డైంది. ఈ శాఖలో ఇంత పెద్ద మొత్తంలో అవినీతి తిమింగలం ఎసిబికి దొరకడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇంకా ఏమైనా పత్రాలు, నగదు,నగలు బ్యాంకు లాకర్లలో ఉన్నాయా? అనే కోణంలో కూడా ఎసిబి అధికారులు కూపీ లాగుతున్నారు. ఇలాంటి అవినీతి తిమింగలాల గురించి ఏదైనా సమాచారం ఉంటే తమ టోల్-ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ 9440446106, నేరుగా తమ కార్యాల యంలో గానీ సంప్రదించవచ్చని ఎసిబి ఈ సందర్భంగా సూచించింది.