హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ పై ఎసిబి దాడి చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో ఎసిబి సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఇడిగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లు ఉండడంతో పాటు పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయ్ దుర్గ మై హోమ్ భుజాలో ఎసిబి సోదాలు చేస్తోంది.