నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్. ‘అఖండ 2’ మూవీ ప్రీమియర్స్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు ఈ మూవీ ప్రీమియర్స్ షోలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా ప్రీమియర్స్ రద్దు చేసినట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా క్యాన్సిల్ చేసినట్టు తెలిపింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా, రేపు(డిసెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.