అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో ఓ ఇంటర్ విద్యార్థిని వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్పందన అనే విద్యార్థిని(17) ధర్మవరం పట్టణంలోని ఓ ప్రేవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన వంశీకృష్ణ అనే విద్యార్థి అదే కాలేజీలో చదువుతున్నాడు. నవంబర్ 26న బస్సులో వెళ్తుండగా విద్యార్థినికి అసభ్యకర సంజ్ఞలు చేశాడు. విద్యార్థిని ప్రశ్నించడంతో ఆమె చెంపచెళ్లుమనిపించాడు. దీంతో స్పందన తన తండ్రితో కలిసి ధర్మవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. దీంతో చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే రోజు ఇంట్లోకి వెళ్లిన తరువాత విద్యార్థిని ఉరేసుకుంది. తల్లిదండ్రులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
పోలీసుల నిర్లక్ష్యంతోనే తన కూతురు చనిపోయిందని స్పందన తండ్రి తెలిపారు. సకాలంలో నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పట్టించుకోలేదన్న మనస్తాపంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులు మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యమే తన కూతురు ప్రాణాలు తీసిందని బాధను వ్యక్తం చేశాడు.