హైదరాబాద్: సైబర్ హ్యాకర్ల దృష్టి పోలీస్ వెబ్ సైట్లపై పడింది. మరోసారి తెలంగాణ పోలీసు వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి రాష్ట్ర పోలీస్ సాంకేతిక విభాగానికి సవాల్ విసిరారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది రెండవసారి ఇలా పోలీస్ సైట్లను హ్యాక్ చేయడం జరిగింది. తాజాగా తెలంగాణ పోలీసు వెబ్ సైట్ సహా హైదరాబాద్ మహా నగర పరిధిలోని సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు చెందిన సైట్లను కూడా హ్యాక్ చేశారు. ప్రస్తుతం పోలీస్ విభాగానికి చెందిన సాంకేతిక నిపుణులు వెబ్ సైట్లను మళ్లీ పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద పోలీస్ సైట్లలోని కీలక సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోవడం ఆందోళన కలిగిస్తోంది.