న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. గురువారం సమీపంలోని పాలెం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగిన పుతిన్‌కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ఈరోజు రాత్రి విందు కోసం పుతిన్, మోడీ నివాసానికి వెళ్తారు. శుక్రవారం, ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఓ కార్యక్రమానికి కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
కాగా, పుతిన్ పర్యటన భారత్, రష్యా.. రెండు దేశాలకు కీలకం కానుంది. భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా మోడీ, పుతిన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బహుళ వాణిజ్య, రక్షణ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. రష్యా నుండి సు-57 ఐదవ తరం యుద్ధ విమానాలు, ఎస్-500 క్షిపణి రక్షణ వ్యవస్థ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే, రష్యన్ ముడి చమురుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్, రష్యన్ ముడి చమురు ఎక్కువగా సేకరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్‌తో యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్ కు రావడం ఇదే తొలిసారి.