అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. టిడిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి బిసి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ పై ఓ ప్రజాప్రతినిధి అనుచరుల దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టపగలు ఇంటిపైకి దుండగులు ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా విషయంలో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డిపై ఓ ప్రజాప్రతినిధి వాఖ్యలపై విజయభాస్కర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మనసులో పెట్టుకొని సదరు ప్రజాప్రతినిధి అనుచరులు ఒక్కసారిగా తన ఇంటిపై 20 నుంచి 30 మంది మంత్రి అనుచరులు దాడి చేశారని ఆరోపణలు చేశారు. తలకు చేతికి బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రక్తపుగాయాలతో బాధితుడు ఆసుపత్రి చేరాడు. తన చంపడానికి ప్రయత్నించారన్నారు. తాను కిందపడిపోవడంతో చనిపోయానని దుండగులు వెళ్లిపోయారని తెలిపారు.