హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ,కార్పొరేషన్ చైర్మన్లు , డిసిసి అధ్యక్షులు ,పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. హుస్నాబాద్ ప్రాంతం అక్కన్నపేటలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ జెండాలు, కటౌట్ల తో అందంగా అలంకరణ, బహిరంగ సభకు భారీ లెడ్ స్క్రీన్ లు ,పార్కింగ్ ప్రదేశాలు, సభకి తరలి వచ్చే జనాలకు మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అభివృద్ధి కార్యక్రమాలు 44.12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కి, రూ. 58.91 కోట్ల అంచనా వ్యయంతో హుస్నాబాద్ టూ అక్కన్నపేట వరకు 4 లేన్ హమ్ రోడ్డుకు, 20 కోట్ల రూపాయల వ్యయంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ పలు అభివృధి కార్యక్రమాలకు, 45.15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎడిసి (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) కు, రూ. 8.5 కోట్ల అంచనా వ్యయంతో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి, రూ. 86 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్ రహదారి నుండి కొత్తపల్లి , హుస్నాబాద్ వరకు 4 లేన్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. హుస్నాబాద్ నుండి హైదరాబాద్ కి ఎక్స్ ప్రెస్ బస్సు కు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్ ను పరిశీలించడంతో పాటు 70 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ చేస్తారు.