హైదరబాద్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాదారం శివారులో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు మంటలను గమనించి, సకాలంలో కారు దిగడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు.