రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో పదో తరగతి విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు మూక దాడికి పాల్పడ్డారు. గురుకుల పాఠశాలలో క్రికెట్ పోటీల సందర్భంగా ఇంటర్, టెన్త్ విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. ఇంటర్ విద్యార్థుల బరితెగించి పదో తరగతి విద్యార్థిపై మూకుమ్మడి దాడి చేశారు. పాత గొడవను మనసులో పెట్టుకుని పదో తరగతి విద్యార్థి కౌశిక్ పై రాత్రి సమయంలో 20 మంది ఇంటర్ విద్యార్థుల దాడి చేశారు. క్రికెట్ బ్యాట్, వికెట్లతో కౌశిక్ ను చితకబాదారు. దాడిని చిత్రీకరిస్తున్న మరో ఐదుగురు విద్యార్థులపై సైతం దాడి చేశారు. గురుకుల సిబ్బంది దాడి ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం తెలిసి పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందిపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు.