ఛత్తీస్ఘడ్ లో మరోసారి భద్రతా దళాలు, మావోయిస్టుల మద్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం బీజాపూర్ జిల్లాలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలం నుంచి మావోల మృతదేహాలతోపాటు భారీగా తుపాకులు, ఆయుధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
కాగా, ఇటీవల పెద్ద ఎత్తున మావోయిస్టులు, పోలీసుల ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఇందులో మావోల టాప్ కమాండర్లు కూడా ఉన్నారు.మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుండగా.. మరోసారి ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కాగా, మావో అగ్ర కమాండర్ హిడ్మాను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపిన సంగతి తెలిసిందే.