న్యూఢిల్లీ: మరో హీరోయిన్ పెళ్లీ పీటలెక్కబోతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్‌ను నూపుర్ వచ్చే ఏడాది వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జంట కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. దేశంలోని అత్యంత విలాసవంతమైన సెలబ్రిటీ వివాహాలకు ఆతిథ్యం ఇచ్చే ఫెయిర్‌మాంట్ ఉదయపూర్ ప్యాలెస్‌లో జనవరి 8, 9 తేదీల్లో నూపుర్ సనన్-స్టెబిన్ బెన్ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కుటుంబం, సన్నిహితులు, బంధువుల మధ్య జరగనున్న వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. వీరి మెహందీ, సంగీత వేడుకలు జనవరి 8న ప్రారంభమవుతాయి. ఆ తర్వాత జనవరి 9న సాంప్రదాయ వివాహ వేడుక జరుగుతుంది.
కాగా, నూపూర్ సనన్ పలు మ్యూజిక్ వీడియోలలో నటించింది. 2023లో ఆమె టెలివిజన్ సిరీస్ పాప్ కౌన్?లో నటించింది. తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మాస్ రాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు మూవీలో హీరోయిన్ గా నటించింది. ‘నూరానీ చెహ్రా’ అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.