హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండానే హిల్ట్ పాలసీ తీసుకువచ్చారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నవారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ కోసం వేసిన కమిటీ సచివాలయంలో ఉండి నివేదిక ఇచ్చిందని తెలియజేశారు. రైతులకు సహకారం అందించకుండా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం.. రైతులకు ఒక విధానమా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా అవినీతి జివొను తెచ్చారని మండిపడ్డారు. వేల ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్సులకు అనుమతి ఇస్తే ట్రాఫిక్ పరిస్థితి ఏంటీ? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.