యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025లో పూర్తిగా డిఫరెంట్ అవతార్‌లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడి యా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. మంగళవారం నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. చెవిటి-, మూగ హీరోయిన్, అసాధారణ కథానాయకుడు, రామాయణ శైలి కథనం ఈ చిత్రానికి ప్రత్యేకతని జోడించింది. ఈ పవర్‌ఫుల్ ట్రైలర్‌లో రోషన్ కనకాల మోగ్లీ పాత్రలో అదరగొట్టారు. సాక్షి మడోల్కర్ సవాలుతో కూడిన పాత్రను పోషించారు. బండి సరోజ్ కుమార్ విలన్‌గా అద్భుతంగా నటించారు. డిసెంబర్ 12న మోగ్లీ 2025 విడుదల కానుంది.