న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భా రత పర్యటనకు ముందే అత్యంత పరిష్టమైన ఐదు వలయాల భద్రతను సిద్ధం చేశారు. రష్యా ప్రెసిడంట్ భద్రతా సిబ్బంది కమాండోలు, భారత జా తీయ భద్రతా గార్డులకు చెందిన అగ్రశ్రేణి కమాండోలు, స్నిప్పర్లు, డ్రోన్లు, జామర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణతో ప్రత్యేక అతిథిని కంటి కి రెప్పలా చూసుకుంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు గురువారం నాటి సా యంత్రం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ న్యూఢిల్లీకి చే రుకుంటారు. భారత- రష్యా వార్షిక శిఖరాగ్ర స మావేశంలో పాల్గొనేందుకు పుతిన్ వస్తున్నారు. గురువారం రాత్రి పుతిన్, ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి భోజనం చేస్తారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు లాంఛనంగా స్వాగతం పలుకుతారు. శుక్రవారం రష్యా ప్రెసిడెంట్ రాజ్ ఘాట్‌లో మహాత్మాగాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. తర్వా త హైదరాబాద్ హౌస్ లో జరిగే భారత -రష్యా శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు.
భారత్ మండపంలో జరిగే కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో ఆయన పాల్గొంటారు. రష్యన్ ప్రెసిడెంట్ కార్యక్రమాలకు సంబంధించి అత్యున్నత భద్రతను పర్యవేక్షించేందుకు, నిర్ధారించేందుకు, రష్యా నుంచి నాలుగు డజన్లకు పైగా అత్యున్నత భద్రతా సిబ్బంది ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పుతిన్ వాహన శ్రేణి ప్రయాణించే ప్రతిమార్గాన్ని ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఎస్‌జి అధికారులు వెయ్యి కళ్లతో నిఘా కాస్తున్నారు. రోడ్లను అద్దంలా సిద్ధం చేశారు. ప్రత్యేక డ్రోన్లతో భద్రతా కార్యకలాపాలను కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం నిఘా చేస్తున్నాయి. అనేక మంది స్నిపర్లు ప్రెసిడెంట్ కదలిక మార్గాన్ని కవర్ చేస్తారు. జామర్లు, ఏఐ పర్యవేక్షణ, ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు, భారీ సాంకేతిక పరికరాలు కూడా ఆయన భద్రతను అడుగడుగునా కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటాయి. పుతిన్ బసచేసే హోటల్ పూర్తిగా భద్రతా దళాల స్వాధీనంలో ఉంది. మొత్తం హోటల్ ను పూర్తిగా శానిటైజ్ చేశారు. రష్యన్ సెక్యూరిటీ అధికారులే తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడుగడుగునా స్కాన్ చేస్తున్నారు.