రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో రెండో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ బావుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్..అదే టీమ్ తో బరిలోకి దిగుతోంది. ఇక, సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేశారు. తొలి వన్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ బావుమా తిరిగి జట్టుతో కలిశాడు. అలాగే, స్పిన్నర్ కేశవ్ మహరాజ్, స్టార్ బౌలర్ లుంగి ఎన్గిడి జట్టులోకి తీసుకున్నారు. కాగా, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
జట్ల వివరాలు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్ (w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్‌రామ్, టెంబా బావుమా(సి), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎన్గిడి.