రాయ్‌పూర్: దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. బుధవారం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. 2025 ఆసియా కప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల పంజాబ్‌తో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో హార్దిక్ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక, గాయపడి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మాన్ గిల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, అతని ఎంపిక తుది ఫిట్‌నెస్ పరీక్షపై ఆధారపడి ఉంటుంది.
ఇక, రింకు సింగ్‌ను జట్టు నుండి తొలగించారు. ఇటీవల జట్టులోకి తీసుకున్నా.. ఎక్కువ మ్యాచ్‌ల్లో రింకూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ బ్యాట్స్‌మన్ అవకాశం ఇచ్చినప్పుడల్లా తన ప్రతిభను చాటుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన T20I సిరీస్‌లో ఒకే ఒక్క అవకాశం లభించింది కానీ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్ కు ఎంపికనే చేయలేదు. కాగా, డిసెంబర్ 9 నుంచి భారత్-సౌతాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.