జడ్చర్ల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా? అని మండిపడ్డారు. క్షమాపణ చెప్పే వరకు జడ్చర్లలో పవన్ సినిమా ఆడనిచ్చేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రాక్షసులతో పోల్చడం సరికాదని దుయ్యబట్టారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం విధితమే.