మన తెలంగాణ/చర్ల: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దం డకారణ్యం మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లింది. బుధవారం బీజపూర్‌దంతెవాడ జిల్లాల స రిహద్దు, గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్ కుతుల్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పులలో 12మంది మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు డిఆర్‌జి జవాన్లు మృతి చెందారు. ఒక జవాన్‌కు బుల్లెట్ గాయాలవ్వడంతో హుటాహుటిన బీజపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మావోయిస్టులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారంతో డి ఆర్‌జి, ఎస్‌టి ఎఫ్, కోబ్రా, సిఆర్‌పిఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో బుధవారం మద్యాహ్నం కేశ్ కుతల్ అటవీప్రాంతంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువైపు లా భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.
సంఘటనా ప్రాంతం నుండి 12మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు 303 రైఫిల్స్, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్‌సాస్ రైఫిల్స్‌తో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో డిఆర్‌జి హెడ్ కానిస్టేబుల్ మోను వడాడి, కానిస్టేబుల్ దుకారే గొండేలు, రమేష్ సోడి మృతి చెందగా మరో కానిస్టేబుల్ సోమదేవ్ యాద వ్ గాయపడ్డాడు. జవాన్ల మృతదేహంతో పాటు గాయపడ్డ జవాన్‌ను హెలికాప్టర్ ద్వారా బీజపూర్ తరలించారు. ఎన్‌కౌంటర్ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతోంది. మృ తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నా యి. ఎన్‌కౌంటర్‌ను బస్తర్ ఐజి సుందర్ రాజ్, బీజాపూర్ జిల్లా ఎస్పి డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ధ్రువీకరించారు. ఎన్‌కౌంటర్ నుండి తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూం బింగ్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.