పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ ఎల్ బి నగర్ జోన్ పరిధిలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది. బుధవారం సాయంత్రం వచ్చిన ఉత్తర్వు ల మేరకు పెద్ద అంబర్ పేట్ కార్యాలయం లో పలు రికార్డులను జిహెచ్ఎంసి హయత్ నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్ వంశీ కృష్ణ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కార్యాలయం బోర్డులు తొలగించి పెద్ద అంబర్ పేట్ సర్కిల్ కార్యాలయంగా మార్చడం జరిగింది. పెద్ద అంబర్ పేట్ సర్కిల్ డీసీ గా ఎస్. రవీందర్ రెడ్డి విధులను నిర్వహించనున్నారు.