“శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము తెలియజేస్తున్నాము”అని అన్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన మాట్లాడుతూ “ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు కొంత మంది ఇప్పుడు ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాము. దయచేసి అప్పటి వరకు మా నుండి అధికారిక సమాచారం వచ్చేదాకా ఎలాంటి నిర్ధారణలకు రావొద్దని, ధృవీకరించని వార్తలను మీ గౌరవ మీడియాలో ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నాము”అని తెలియజేశారు.