హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోడీని కలిసి బుల్లెట్ ట్రైన్ ఇస్తావా.. చస్తావా అని అడుగుతామని చెప్పారు. ఒకవేళ ఇవ్వకపోతే.. ఒకటికి పదిసార్లు అడుగుతామని.. బుల్లెట్ ట్రైన్ మాకెందుకు ఇవ్వరో కొట్లాడుతామని సిఎం అన్నారు. ఈ నెలాఖరున వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. 2034 వరకు తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమిగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరంలో నాచారంతో పాటు పలు ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నాయని.. ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలుష్య పరిశ్రమలన్నింటినీ బయటకు తరలిస్తామని సిఎం రేవంత్ చెప్పారు.