తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీ రో, హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ క్రై మ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్. బ్లాక్ బస్ట ర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజ ల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భం గా జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమం లో హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ “దర్శకుడు పళని… రాజమౌళి స్టై ల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూ డా బోర్ కొట్టించుకుండా సినిమాను తీశారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాహుబలి పళని, రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్, అపర్ణ మల్లిక్, హీనా సోని, సాగర్ వేలూరు పాల్గొన్నారు.