టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వచ్చే ఐదేళ్లలో అణుయుద్ధం జరగవచ్చని పేర్కొన్నారు. ఎక్స్‌లో ఓ యూజర్ పోస్టుకు సమాధానంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. హంటర్ యాష్ అనే ఓ యూజర్ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టాడు. “ అణ్వాయుధాలు ప్రధాన శక్తుల మధ్య యుద్ధాన్ని , యుద్ధ ముప్పును నిరోధిస్తాయని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు పిచ్చిగా నమ్ముతున్నాయి కాబట్టి, ఆ ప్రభుత్వాలపై బయటి శక్తుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు” అని రాసుకొచ్చాడు. దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని పేర్కొన్నారు. ‘యుద్ధం అనివార్యం. 5,10 ఏళ్లలో ఇది జరుగుతుంది ” అని రాసుకొచ్చారు. అయితే తన వ్యాఖ్యలపై మస్క్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ శాఖలో పనిచేసిన మస్క్… ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక యుద్ధం జరగబోతోందంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొందరు యూజర్లు ఎలాన్‌మస్క్ డెవలప్ చేసిన కృత్రిమ మేధ చాట్‌బాట్ “గ్రోక్” ను ్ల అడగ్గా, ఎలాన్‌మస్క్ తన పోస్టుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని తెలిపింది. అయితే ఆయన గతంలో చేసిన ప్రకటన ఆధారంగా సామూహిక వలసలు, రాజకీయ కారణాల వల్ల యూరప్ యూకే లోని అంతర్యుద్ధం జరగవచ్చని మస్క్ హెచ్చరించినట్టు తెలిపింది. దీంతోపాటు తైవాన్ విషయంలో యూఎస్‌చైనా, ఉక్రెయిన్ లోని సంఘర్షణలు మూడో ప్రపంచయుద్ధంగా మారిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గురించి ప్రస్తావించింది.